రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేలా ఆడాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:55 PM
అండర్-17 జోనల్ ఫుట్‌బాల్ బాలబాలికల టోర్నమెంట్ కం సెలక్షన్‌లో గద్వాల జిల్లా క్రీడాకారులు మంచి ప్రతి భ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావా లని జిల్లా అసోసియేషన్ ఫుట్‌బాల్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు అన్నారు.
డీఎఫ్‌ఏ అధ్యక్షుడు బండల వెంకట్రాములు
గద్వాల అర్బన్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లాలో ఈనెల 3న జరిగే అండర్-17 జోనల్ ఫుట్‌బాల్ బాలబాలికల టోర్నమెంట్ కం సెలక్షన్‌లో గద్వాల జిల్లా క్రీడాకారులు మంచి ప్రతి భ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావా లని జిల్లా అసోసియేషన్ ఫుట్‌బాల్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సోమనాద్రి ఫుట్‌బాల్ మినీ సేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీ డాకారులను పరిచయం చేసుకుని మాట్లాడా రు. జోనల్‌స్థాయి పోటీల్లో జిల్లాలోని బాలబాలి కలు జట్టు విజయానికి దోహదపడేలా రా ణిం చి విజయం సాధించాలన్నారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యేలా తమలోని నైపు ణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఏ కార్యదర్శి విజయ్‌కుమార్, ప్రవీణ్ సేవా సమితి అధ్యక్షుడు ఇండికా శివ, క్రీడాకా రులు ఉన్నారు.