భక్తిశ్రద్ధలతో కార్తీక తొలి సోమవారం పూజలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:26 PM
శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మా సంలో వచ్చే తొలి సోమవారం పట్టణంలో ని పలు ఆలయాల్లో భక్తులు కార్తీక దీపా లను భక్తిశ్రద్ధలతో వెలిగించారు.
గద్వాలటౌన్, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మా సంలో వచ్చే తొలి సోమవారం పట్టణంలో ని పలు ఆలయాల్లో భక్తులు కార్తీక దీపా లను భక్తిశ్రద్ధలతో వెలిగించారు. ప్రధానంగా శైవ ఆలయాలుగా ఉన్న నందీశ్వర ఆల యం, భద్రకాళి సమేత వీరభద్ర ఆలయం, భీమలింగేశ్వర ఆలయం, పాండురంగ శివా లయం, భక్తమార్కండేయ, అన్నపూర్ణ ఆల యం మహిళలు సాయంకాలం వేళ సా మూహిక దీపారాధనలు చేశారు. స్థానిక భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం వద్ద వీరశైవులు సంప్రదాయబద్దమైన నంది కోల సేవలను ఉత్సాహంగా నిర్వహించారు.