Share News

ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:43 PM

ప్రతీ విద్యార్థికి పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య అందాలన్న సంకల్పంతో ప్రాథమిక విద్యా బలోపేతానికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి
ఎస్జీటీయూ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల సర్కిల్‌, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థికి పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య అందాలన్న సంకల్పంతో ప్రాథమిక విద్యా బలోపేతానికి కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలో ని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో ఆదివారం ఎస్జీటీయూ(సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ యూనియన్‌)- 2026 నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వ్యవస్థను అన్నీ విధాలుగా అభివృద్ధి చేయడమే తన ముందుకున్న ప్రధాన లక్ష్యమని చెప్పారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రస్థాయిలో గద్వాల నియోజకవర్గ విద్యా ప్ర మాణాల మెరుగుకు ప్రత్యేక చర్యలు చేపడుతానని తెలిపారు. ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించేలా ఎస్జీటీయూ తరఫున ప్రభుత్వానికి తాను వారధిగా ఉంటానని ఈ సందర్భంగా ఎ మ్మెల్యే స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు ఎదు ర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కరించడానికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. క్యాలెండర్‌ ఆవిష్కరణ అనంతరం ఉపాధ్యాయులకు, యూనియన్‌ ప్రతినిధులకు ఎమ్మెల్యే ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీటీయూ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌, గౌరవ అధ్యక్షుడు బాలరాజ్‌, ప్రధాన కార్యదర్శి వినోద్‌, మహిళా కార్యదర్శి సుమిత్ర, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎమినా నాయక్‌, జిల్లా కార్యదర్శి జీవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:43 PM