న్యాయవాదుల సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:48 PM
న్యాయవాదుల సంక్షేమంతో పాటు వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామనని రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు.
- రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి
హహబూబ్‌నగర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : న్యాయవాదుల సంక్షేమంతో పాటు వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామనని రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికవడంతో గురువారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల సంఘం, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అందరి సహకారంలో జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఐదుసార్లు ఎన్నిక కావడం జరిగిందని, ఇదే స్పూర్తితో బార్‌కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో సభ్యుడిగా పోటీలో ఉన్నానని, మీరంతా సహకరించాలని కోరారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నామని, ప్రతీ న్యాయవాదికి ఇన్సూరెన్స్ కార్డు వచ్చేలా ప్రయత్నం చేస్తానన్నారు. నూతన కోర్టు భవన నిర్మాణ పనులకు నవంబరు 1వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. న్యాయవాదుల సంఘం కార్యదర్శి శ్రీధర్‌రావు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమౌళి, నాగోజీ, జాకీర్ హుస్సేన్, జగదీశ్వర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, మురళీకృష్ణ పాల్గొన్నారు.