రైతు సంక్షేమానికి కృషి
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:30 PM
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
- పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ఆత్మకూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. రాష్ట్రం లో రైతులకు సరిపడా యూరియా ఉందని, రైతులు అధైర్య పడొద్దని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. ఆత్మకూరు మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని, రైతు పండించిన ప్రతీ గింజను ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రహమతుల్లా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాయచూర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు.