Share News

లేబర్‌ కోడ్‌లను కార్మికులు వ్యతిరేకించాలి

ABN , Publish Date - May 05 , 2025 | 11:10 PM

కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నాలుగు లే బర్‌ కోడ్‌లను కార్మికులందరూ ముక్తకంఠంతో ప్రతిఘటించాలని నిర్మాణ రంగ కార్మిక యూని యన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటం రాజు పిలుపునిచ్చారు.

లేబర్‌ కోడ్‌లను కార్మికులు వ్యతిరేకించాలి

గద్వాల టౌన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నాలుగు లే బర్‌ కోడ్‌లను కార్మికులందరూ ముక్తకంఠంతో ప్రతిఘటించాలని నిర్మాణ రంగ కార్మిక యూని యన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటం రాజు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల పరిరక్ష ణ కోసం ఈనెల 20న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో నిర్మాణ, అనుబంధ రంగ కార్మికులం తా విధిగా భాగస్వాములు కావాలని కోరారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమ వారం నిర్మాణరంగం, దాని అనుబంధ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. సమా వేశంలో పాల్గొన్న రత్నాకరం కోటంరాజు మా ట్లాడుతూ దేశంలోని 70కోట్లకు పైగా ఉన్న కా ర్మికవర్గానికి ప్రయోజనం చేకూర్చే 44కార్మిక చట్టాలోని 29చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌ లుగా మార్చి కార్మికులను అటు యాజమాన్యా లకు, ఇటు ప్రభుత్వాలకు కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం గర్హనీయమన్నారు. అసంఘ టిత రంగంలోని కార్మికుల సంక్షేమ కోసం ఉద్దేశించిన 1996 వేల్ఫేర్‌ బోర్డు చట్టాన్ని కూడా మార్పు చేయడం ద్వారా కార్మికులకు అందే సంక్షేమ పథకాలకు కోతలు పెట్టడం శోఛనీయ మన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావర వస్తువు లు ధరలతో అల్లాడిపోతున్న పేద, మధ్యతరగ తి వర్గీయులు, కార్మికుల కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల మరింతగా నష్టపోయే ప్రమా దం ఉందన్నారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ తీవ్రతను అరికట్టడంలో విఫలమవుతున్న కేంద్ర ప్రభు త్వం దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచి పెట్టేందుకు సిద్ధం కావడం దౌర్భాగ్యమన్నారు. మరోపక్క విద్యుత్‌ సవరణ చట్టంతో రైతుల పరిస్థితి దుర్బరమయ్యే దుస్థితి తలెత్తిందన్నా రు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్య తిరేక విధానాలకు నిరసనగా తలపెట్టిన సార్వ త్రిక సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని రంగాల కార్మికులు సిద్ధం కావాలని అన్నారు. సమావేశంలో వెంకటేశ్‌, వివి నరింహ, కిష్టప్ప, మోష, కృష్ణ, సీతారాములు, రాము, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:10 PM