Share News

పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 10:51 PM

సమీకృత కలె క్టర్‌ కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా ప ట్నాయక్‌ అధికారులను ఆదేశిం చారు.

పనులు త్వరగా పూర్తి చేయాలి
సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేట టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): సమీకృత కలె క్టర్‌ కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా ప ట్నాయక్‌ అధికారులను ఆదేశిం చారు. బుధవారం సింగారం వద్ద నిర్మిస్తున్న ఐడీవోసీ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. గదులు, మిగిలిన పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యత పా టించాలని అధికారులను ఆదేశించారు.

ఉపాఽధిహామీ పథకం పనుల్లో

వేగం పెంచాలి

జిల్లాలో ఉపాధిహామీ పథకం పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచిం చారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌తో కలిసి ఉపాధిహామీ పనులు, ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ భరోసాపై అధికారులతో సమీక్షించారు. ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసు కునేలా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగా హన కల్పించాలన్నారు. వనమహోత్సవం కార్య క్రమంలో భాగంగా జిల్లాకు ఇచ్చిన లక్ష్యం ప్రకా రం వంద శాతం మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. పంచాయతీ కార్యదర్శు లు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమీక్షలో జడ్పీ సీఈవో శైలేష్‌కుమార్‌, డీఎస్పీ లింగయ్య, డీఆర్డీవో మొగులప్ప, ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 10:52 PM