Share News

త్వరగా పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - May 01 , 2025 | 11:42 PM

ప్ర భుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులను త్వ రగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సంబంధిత అధి కారులకు ఆదేశించారు.

త్వరగా పనులు పూర్తి చేయాలి

- నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్ర భుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులను త్వ రగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సంబంధిత అధి కారులకు ఆదేశించారు. గురువారం పట్టణ శి వారులో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాలను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా నర్సింగ్‌ కళాశాల, హాస్టల్‌ భవనాలను పరిశీలించారు. జీ+1 భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నీటి సరఫరా తరగతి గదులు, ల్యా బ్‌లు, హాస్టల్‌ గదులు, ఇతర విద్యార్థులకు అవ సరమైన అన్ని వసతులను స్వయంగా పరిశీలించి, అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యం గా కళాశాల వసతులకు అనుగుణంగా జీ+1 నిర్మాణం పూర్తి చేయాలని, విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొ దటి అంతస్తులో ఫ్లోరింగ్‌, ప్లాస్టరింగ్‌, పెయింటింగ్‌ విద్యుత్‌, తదితర సదుపాయాలు సంబంధించిన పనులను తక్షణమే పూర్తి చేసి అవసరమైన సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించా రు. ప్రాజెక్టు మ్యాప్‌ ద్వారా ప్రాజెక్ట్‌ వివరాలను కలెక్టర్‌ పరిశీలించారు. పనులు అన్ని నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆధికారులకు సూచించారు. ఈ కా ర్యక్రమంలో నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హనుమంతమ్మ, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 01 , 2025 | 11:42 PM