Share News

పునరావాస కేంద్రంలో పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:39 PM

ర్యాలం పాడు పునరావాస కేంద్రంలో పెండింగ్‌ పనుల ను త్వరితగతిన పూర్తి చేసి అన్ని సౌకర్యాలు క ల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించా రు.

పునరావాస కేంద్రంలో పనులు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ర్యాలంపాడు పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే

ధరూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ర్యాలం పాడు పునరావాస కేంద్రంలో పెండింగ్‌ పనుల ను త్వరితగతిన పూర్తి చేసి అన్ని సౌకర్యాలు క ల్పించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించా రు. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొం దించి అన్ని సదుపాయాలు కల్పించేందుకు తక్ష ణ చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు కలెక్టర్‌, ఎమ్మెల్యే లేఔట్‌ మ్యాప్‌ను పరిశీలించి అన్నిపనుల వివరాలు, ప్రగతి, పురోగతి గురించి అధికారులతో చర్చించారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ర్యాలంపాడు పునరావాస కేంద్రాన్ని కలెక్టర్‌ బీఎం సంతోష్‌తో కలిసి ఎమ్మెల్యే సంద ర్శించారు. అనంతరం గ్రామస్థులు, అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహంచారు. ఈ సంద ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ భూములను త్యాగం చేయడం వల్లే నాలుగు టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మాణం సాధ్య మైందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గ ద్వాల అభివృద్ధిలో ర్యాలంపాడు గ్రామస్థులు చే సిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపో తుందన్నారు. పునరావాస కేంద్రంలో రోడ్లు, తా గునీరు, ఆస్పత్రి, పంచాయతీ భవనం, అంగన్‌ వాడీ కేంద్రాలు, దేవాలయాలు, చర్చిలతో సహా అన్ని సదుపాయాలు లేఔట్‌ ప్రకారం ఏర్పాటు చేస్తామన్నారు. ర్యాలంపాడులో ఎక్కువ మంది ఇందిరమ్మ ఇళ్లకు అర్హులుగా గుర్తించి వారికి గృహాలు మంజూరు చేశామని ఎమ్మెల్యే తెలిపా రు. ఆర్‌అండ్‌ఆర్‌ సెంటర్‌లో అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కలెక్టర్‌ బీఎం సంతోష్‌ మాట్లాడుతూ ర్యాలంపాడు గ్రామస్థులు తమ భూములను అందజేయడం వల్ల జిల్లాలో 1,80,000 ఎకరాల కు సాగునీరు అందించే నాలుగు టీఎంసీల రిజ ర్వాయర్‌ నిర్మాణం పూర్తయ్యిందన్నారు. భూము లు కోల్పోయిన రైతులకు ప్ర భుత్వం పూర్తి బాధ్యతతో వాటిని పునరావాస కేంద్రాల్లో అందజేస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కో సం అవసరమైన అన్ని సౌకర్యాలను లేఔట్‌ ప్ర కారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వివరించా రు. భూసేకరణలో 67 ఎకరాల 28 గుంటల భూమిలో మొత్తం 823 ప్లాట్లను ఏర్పాటు చేయ గా, ఇప్పటికే 695 ప్లాట్లను భూ నిర్వాసితు లకు మంజూరు చేశామన్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామంలో 250కి పైగా ఇళ్లను మంజూరు చేశామని తెలి పారు. విద్యుత్‌, తాగునీరు. రోడ్లు, డ్రైనేజీలు, లిం క్‌ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం గ్రామస్థులు తమ సమస్యను వివరిస్తూ ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, తహసీ ల్దార్‌ నరేందర్‌, మాజీ ఎంపీపీ విజయ్‌, జడ్పీటీ సీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌, మాజీ వైస్‌ఎంపీ పీ సుదర్శన్‌రెడ్డి, చంద్రశే ఖర్‌, పురుషోత్తంరెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాసులు, అధికా రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లు ఉన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:39 PM