నిబంధనలకు లోబడి పని చేయాలి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:20 PM
జిల్లా పరిధిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా పా రదర్శకంగా చట్టబద్ధంగా నిర్వహించేందుకు వి ధులు నిర్వర్తించే నారాయణపేట సర్కిల్ పోలీసులకు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిం చారు.
- డీఎస్పీ నల్లపు లింగయ్య
నారాయణపేట, డిసెంబరు 7 (ఆంధ్ర జ్యోతి) : జిల్లా పరిధిలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా పా రదర్శకంగా చట్టబద్ధంగా నిర్వహించేందుకు వి ధులు నిర్వర్తించే నారాయణపేట సర్కిల్ పోలీసులకు ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిం చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భం గా ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది రాష్ట్ర ఎ న్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పని చేయాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి డీఎస్పీ నల్లపు లిం గయ్య, సీఐలు శివ శంకర్, రాజేందర్‌రెడ్డి హాజ రై పోలీసు సిబ్బందికి ఎన్నికల సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన ని బంధనలు, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, ప్రవ ర్తనా నియమావళిపై ఎన్నికల సమయంలో పోలీసులు ఏం పనులు చేయాలి, ఎలాంటి ప నులు చేయకూడదు అనే విషయాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా డీఎస్పీ మాట్లాడుతూ... ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉంటూ రాజకీ య పార్టీలతో పక్షపాతం లేని విధంగా, చట్టప రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తె లిపారు. పోలింగ్ సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్య క్తులు, అక్రమంగా డబ్బు, మద్యం, బహుమ తుల పంపిణీ, ఓటర్లకు బెదిరింపులు వంటి సంఘటనలు గమనిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటు ప్ర దేశాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ ( 144ఐపీఎస్) సెక్షన్, డ్రై డే ప్రత్యేక నిబంధనలు, మహిళా భద్రత వంటి అంశాలపై వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచాలని, ఎలాంటి గొడవలు జరిగే ఆస్కారం ఉన్నా గొడవలు జ రుగుతున్నా వెంటనే పైఅధికారులకు నివేదిం చాలని సూచించారు. సీఐలు శివశంకర్, రాజేం దర్ రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు, పోలీసు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.