మహిళలు స్వశక్తితో ఎదగాలి
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:02 PM
మహిళా సంఘాలు బలోపేతం కావాలని, మహిళలు స్వశక్తితో ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తపన అని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.
- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
- కోస్గిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
కోస్గి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాలు బలోపేతం కావాలని, మహిళలు స్వశక్తితో ఎదగాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తపన అని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం కోస్గి పట్టణంలో ఆయన ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెప్మా ద్వారా ప్రభుత్వ స్థలంలో క్యాంటీన్‌ను నిర్మించి ఆదర్శ భూలక్ష్మి సంఘానికి అప్పగించామన్నారు. ఇప్పటికే మండల మహిళా సమాఖ్యకు ఓ ఆర్టీసీ బస్సును అప్పగించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు మహిళా సంఘాలకు అందేలా చూస్తామన్నారు. అనంతరం మహిళా క్యాంటీన్ పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా వేసిన షెడ్లను తొలగించాలని మునిసి పల్ కమిషనర్ నాగరాజును ఆదేశించారు. ప్రభుత్వ స్థలానికి ప్రహరీ నిర్మించి బోర్డు ఏర్పా టు చేయాలన్నారు. కార్యక్రమంలో కాడా అధి కారి వెంకట్‌రెడ్డి, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, మునిసిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, పార్టీ మహిళా అధ్యక్షురాలు ప్రసన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.