Share News

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:44 PM

ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు స్వశక్తితో ఆర్థికంగా బలోపేతం కావాలని ము నిసిపల్‌ కమిషనర్‌ దశరథ్‌ కోరారు.

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి

  • మునిసిపల్‌ కమిషనర్‌ దశరథ్‌

  • మెప్మా ఆధ్వర్యంలో వివిధ ఉత్పత్తుల ప్రదర్శన

గద్వాల టౌన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో మహిళలు స్వశక్తితో ఆర్థికంగా బలోపేతం కావాలని ము నిసిపల్‌ కమిషనర్‌ దశరథ్‌ కోరారు. పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్నిసద్వినియోగం చేసుకోవాలన్నారు. మెప్మా ద్వారా లభించిన ఆర్థి క సహాయంతో పట్టణంలోని వివిధ మహిళా సంఘాలు చేపడుతున్న వస్తు ఉత్పత్తులను బు ధవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఆవ రణలో ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ప్రదర్శన ను ప్రారంభించి వస్తువులను తిలకించిన కమి షనర్‌, మహిళా సంఘాల సభ్యులను అభినం దించారు. పట్టణంలోని అన్నివార్డులకు చెంది న మహిళలు తరలివచ్చి తాము ఉత్పత్తి చేసిన వివిధ రకాలు వస్తువులు, ఆహార పదార్థాలు, ప్రదర్శనలో ఉంచారు. కార్యక్రమంలో ఆర్‌వో రాజేష్‌కుమార్‌, ఏఈ గోపాల్‌, మెప్మా సిబ్బంది వెంకటేశ్వర్లు, నిజాముద్దీన్‌, తిమ్మన్న, మహాలక్ష్మి, రీసోర్సుపర్సన్లు, మునిసిపల్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 11:44 PM