Share News

మహిళా ఉద్యోగుల బైక్‌ ర్యాలీ

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:12 PM

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మంగళవారం జిల్లా మహిళా, శిశు, ది వ్యాంగ, వయోవృద్ధ్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో వివిధ శాఖల మహిళా ఉద్యోగులతో బైక్‌ర్యాలీని నిర్వహించారు.

మహిళా ఉద్యోగుల బైక్‌ ర్యాలీ
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

గద్వాల న్యూటౌన్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మంగళవారం జిల్లా మహిళా, శిశు, ది వ్యాంగ, వయోవృద్ధ్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో వివిధ శాఖల మహిళా ఉద్యోగులతో బైక్‌ర్యాలీని నిర్వహించారు. కలెక్టరేట్‌ ఆవరణలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు ఆ యన మాట్లాడుతూ మహిళలు ఎదిగితే సమా జం అభివృద్ధి చెందుతుందని, మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. సమాజంలో మహిళల సాధికారత కోసం ప్రతీ ఒక్కరు తోడ్పడాలన్నారు. ర్యాలీ కలెక్టర్‌ కార్యాలయం నుంచి స్థానిక కృష్ణవేణి చౌరస్తా వరకు నిర్వహించారు. అనంతరం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం మహిళలకు పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సునంద, డీసీపీవో నర్సింహులు, వివిధ శాఖల ఉద్యోగులు ఉన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:12 PM