Share News

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:53 PM

భర్త దుకాణానికి వెళ్లి వచ్చేలోగా తన భార్య బలిజ లక్ష్మి (52) ఇంట్లో శవమై కనపడడంతో షాక్‌కు గురైన భర్త మల్లికార్జున్‌ వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిండు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది.

 అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
క్లూస్‌టీంతో వివరాలను సేకరిస్తున్న పోలీసులు

- బంగారు, వెండి ఆభరణాలను లాక్కొని హత్య చేశారనే అనుమానాలు

- క్లూస్‌ టీంతో పరిశీలిస్తున్న పోలీసులు

గద్వాల క్రైం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): భర్త దుకాణానికి వెళ్లి వచ్చేలోగా తన భార్య బలిజ లక్ష్మి (52) ఇంట్లో శవమై కనపడడంతో షాక్‌కు గురైన భర్త మల్లికార్జున్‌ వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిండు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. జిల్లా కేంద్రంలోని షేరెల్లివీధికి చెందిన మల్లికార్జున్‌ ప్రతిరోజు లాగానే ఆదివారం తన ఫర్టిలైజర్‌ దుకాణానికి ఉదయం 10 గంటల సమయంలో వెళ్లాడు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు భోజనానికి ఇంటికి వచ్చాడు. తన భార్య ఇంట్లో విగతజీవిగా పడి ఉంది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, ఆమె ఒంటిపై ఉన్న నాలుగన్నర తులాల బంగారు గొలుసు, కాళ్లకు ఉన్న వెండి కడియాలు, పట్టీలు లేకపోవడం గమనించాడు. అంతేకాక తన భార్య ఒంటిపై గాయాలుండటంతో బంగారు, వెండి ఆభరణాల కోసం ఎవరో హత్యచేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సంఘటన స్ధలాన్ని సీఐ టంగుటూరి శ్రీను, పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు కళ్యాణ్‌కుమార్‌, శ్రీకాంత్‌తో పాటు, క్లూస్‌టీం సిబ్బంది పరిశీలించారు. అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌టీంతో పరిశీలించి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Updated Date - Nov 02 , 2025 | 10:53 PM