రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:38 PM
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది.
రాజాపూర్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శివానందం తెలి పిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలోని స్థానిక జాతీయ రహదారిపై నాగర్‌కర్నుల్ జిల్లా తిమ్మజిపేట మండలం పుల్లగిరి గ్రామం చెంద్రాయిన్ పల్లితండాకు చెందిన శ్రీను, అతని భార్య శారద(35) ప్రతీ రోజు మాదిరిగా తమ ద్విచక్ర వాహనంపై మండలం లోని మల్లేపల్లి గ్రామంలో పనులకు వస్తున్నారు. ముదిరెడ్డిపల్లి గ్రామం లోని స్థానిక ఎక్స్‌రోడ్డు దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో శారద రోడ్డుపై పడడంతో వెనుక వచ్చిన లారీ ఆమె తలపై నుంచి పో వడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతుడి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంత రం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.