Share News

ట్రాక్టర్‌ బోల్తాపడి మహిళ మృతి

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:22 PM

ట్రాక్టర్‌ బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. జోగుళాంబ గద్వాల జిల్లా, జమ్మిచేడు శివారులో గురువారం ఈ సంఘటన జరి గింది.

 ట్రాక్టర్‌ బోల్తాపడి మహిళ మృతి

గద్వాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ట్రాక్టర్‌ బోల్తాపడి ఓ మహిళ మృతి చెందింది. జోగుళాంబ గద్వాల జిల్లా, జమ్మిచేడు శివారులో గురువారం ఈ సంఘటన జరి గింది. రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల మండలంలోని లత్తిపురం గ్రామానికి చెందిన కలిమి శంకర్‌, ఆయన భార్య కలిమి పావని (30) కంకర వేసుకొచ్చేందుకు ట్రాక్టర్‌లో వెంకటోనిపల్లి గ్రామానికి వెళ్లారు. కంకర వేసుకొ ని గ్రామానికి తిరిగి వస్తుండగా, జమ్మిచేడు శివారులో 9వ నెంబర్‌ కాలువ దగ్గర డ్రైవర్‌ సురేందర్‌ అతివేగంగా, అజాగ్రత్తగా నడుపడంతో ట్రాక్టర్‌ బోల్తాపడింది. దీంతో పావని ట్రాలీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనపై భర్త శంకర్‌ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 25 , 2025 | 11:22 PM