Share News

వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:53 PM

పెళ్లి చేసుకొని ఏ డాది కాకుం డానే తల్లిదండ్రుల నుంచి అదనపు క ట్నంతో పా టు బంగారం ఇప్పించాలని భార్యను భర్తతో పాటు అత్తవారింటి వారు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్ప డింది.

 వరకట్న వేధింపులతో మహిళ ఆత్మహత్య

కోయిలకొండ, ఆగస్టు 24 (ఆంధ్ర జ్యోతి): పెళ్లి చేసుకొని ఏ డాది కాకుం డానే తల్లిదండ్రుల నుంచి అదనపు క ట్నంతో పా టు బంగారం ఇప్పించాలని భార్యను భర్తతో పాటు అత్తవారింటి వారు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్ప డింది. ఉరి వేసుకొని వెంకటేశ్వరి (సంధ్య) ఆత్మహత్య చేసుకొన్న సంఘటన కోయిలకొండ మండలం రాంపూర్‌ గ్రామంలో చోటు చేసుకొంది. ఎస్‌ఐ తిరుపాజీ ఆదివారం ఇందుకు గల వివరాలను వెల్లడించారు. కో యిలకొండ మండలంలోని రాంపూర్‌ గ్రామానికి చెందిన గంజి రాజుకు హన్వాడ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వెంక టేశ్వరితో 2024 అక్టోబర్‌ 17న రాంపూర్‌లో వి వాహం జరిగింది. రాజుకు వరటక్నం కింద రూ 2లక్షలు, 4 తు లాల బంగారం అం దించారు. కొన్ని రోజులు అయిన తరువాత భర్త రాజు అవసరం కోసం పెళ్లిలో పెట్టిన బంగారం తకట్టు పె ట్టి డబ్బులు తీసుకు న్నాడు. ఆ తరువాత వెంకటేశ్వరి వారి తల్లి గారి నుంచి బంగారంతో పాటు డబ్బులు ఇవ్వాలని రాజు భార్య ను వేధిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన వరకట్నం తీసుకురా వా లని భార్యని తల్లిగారి ఇంటికి పంపించాడు. పంచాయతీ పెట్టి స ర్ధి చెప్పి భార్య వెంకటేశ్వరిని అత్తవారి ఇంటికి పంపించారు. మ ళ్లీ భర్త రాజు, అత్తంటివారు వరకట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో వెంకటేశ్వరి శనివారం అత్తవారింటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. బాధితురాలి తల్లి అంజమ్మ ఫిర్యాదు మే రకు భర్త గంజి రాజు, అత్త, మామలు గంజి రాములు, దేవమ్మ, మరిది నాని, ఆడకూతురు జ్యోతి, మేనమామ పారుపల్లి శ్రీహ రిపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 24 , 2025 | 11:53 PM