పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా?
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:42 PM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పదేళ్లుగా చేయని అభివృద్ధి ఇప్పు డు చేస్తారా? అభివృద్ధి కోసం పార్టీ మారానం టూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూర్ లక్ష్మన్ విమర్శించారు.
ఎమ్మెల్యేను ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు
గద్వాల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పదేళ్లుగా చేయని అభివృద్ధి ఇప్పు డు చేస్తారా? అభివృద్ధి కోసం పార్టీ మారానం టూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాడని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శెట్టి ఆత్మకూర్ లక్ష్మన్ విమర్శించారు. ఆదివారం సరిత క్యాంపు కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవంలో ప్రొటోకాల్‌పై అధికారులను నిలదీస్తే ఎమ్మెల్యే ఎందుకు బుజాలు తడుముకోవాలని ప్రశ్నించారు. ఒకపార్టీ గుర్తు తో గెలిచి మరో పార్టీలో నివాసం ఉంటున్నాడని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఉన్న ఆ యన అభివృద్ధి కోసం ఎందుకు పాటుపడడంలేదని నిలదీశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి ఆ యనతో పాటు ఆయన అనుచరులు అభివృద్ధి చేందేందుకే వచ్చాడని ప్రజల అభివృద్ధిని గాలికి వదిలేశాడని విమర్శించారు. వలస నాయకులు, అలంపూర్ నాయకులు అని చెత్తమాటలు మాట్లాడే వారు ఏ ప్రాంత నాయకులు మోచేతి నీళ్లు తాగారో మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 90వేల మంది తొడకొట్టి సరితమ్మ నా యకత్వాన్ని బలపరిచారని గుర్తుచేశారు. దీనిని జీర్ణించుకోలేని మీరు బలహీన పర్చడానికి చే యని ప్రయత్నం లేదన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ద్వంద్వ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్‌లో బొంద పెడతారని హెచ్చరించారు. సమావేశంలో గోనుపాడు శ్రీనివాస్‌గౌడ్, రాజశేఖర్‌రెడ్డి, గోపాల్, బిల్డర్ రామక్రిష్ణ, అయ్య ప్ప, రాముడు ఉన్నారు.