సారొస్తారొస్తారా?
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:24 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డ రాజకీయం విభిన్నం... పక్కనే ఉన్న రాయలసీమ ప్రభావం... గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కులాల ఆధిపత్యం... సంప్రదాయ ఓటుబ్యాంకు... పార్టీలు కాకుండా వ్యక్తులు, కుటుంబాలను బట్టి ప్రజాతీర్పు ఇక్కడ ప్రత్యేకం...
నేడు గద్వాల జిల్లాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన
బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
పార్టీలో ఉంటే కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదన్న కేటీఆర్
తాజా పరిణామాల నేపథ్యంలో గద్వాల సభకు వెళ్లే విషయంలో ఉత్కంఠ
తిరిగి గులాబీ గూటికి మాజీ మునిసిపల్ చైర్మన్ కేశవ్, మాజీ కౌన్సిలర్లు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డ రాజకీయం విభిన్నం... పక్కనే ఉన్న రాయలసీమ ప్రభావం... గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కులాల ఆధిపత్యం... సంప్రదాయ ఓటుబ్యాంకు... పార్టీలు కాకుండా వ్యక్తులు, కుటుంబాలను బట్టి ప్రజాతీర్పు ఇక్కడ ప్రత్యేకం... అప్పుడప్పుడే జరిగిన ఎన్నికల్లో ఓ తీర్పును ఇచ్చిన ప్రజలు ఆ వెంటనే జరిగే మరో ఎన్నికల్లో మరో తీర్పును ఇస్తారు... ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల కేసుపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతున్న వేళ తమ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఆరోపిస్తున్నారు.. లేదులేదు తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని బండ్ల అసెంబ్లీ స్పీకర్‌కు బదులిచ్చారు. ఈ పరిస్థితుల్లో గద్వాలలో జరిగే కేటీఆర్ సభకు బండ్ల వస్తారా.. రారా.. ఇప్పుడు ఇదే ఉత్కంఠ...
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన కొద్ది రోజులుగా హాట్‌టాపిక్‌గా మారిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ మారిన వ్యవహారం మరింత ఉ త్కంఠగా మారింది. గ ద్వాల జిల్లాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెం ట్ కేటీఆర్ శనివారం పర్యటిస్తుండటంతో ఏం జరుగుతుందోన న్న చర్చ ఉన్నది. గత అ సెంబ్లీ ఎన్నికలలో బీఆర్‌ఎస్ తరఫున ఉ మ్మడి మహబూబ్ న గర్ జిల్లాలో పోటీ చేసిన వారిలో ఇద్దరు మాత్రమే గెలుపొందగా అందులో గ ద్వాల ఎమ్మెల్యే ఒకరు. అయితే గెలిచిన తర్వాత ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కండువా కప్పుకున్నప్పటి నుంచి చర్చ ప్రారంభమైంది. తాను అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ను కలిశానని, కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని ఆయన చెబుతుండగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాత్రం బండ్లతో పాటు పది మంది తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రె్‌సలో చేరారని సుప్రీం కోర్టులో కేసు వేశారు. సుప్రీం కోర్టు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం, దానికి ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడం లాం టివి చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు చర్యల బంతి స్పీకర్ కోర్టులో ఉన్నది. న్యాయ సలహాలు తీసుకొని తన విచక్షణ అధికారాలతో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ బండ్ల సహా మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నామని అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎంను కలిశామని, ఆ సమయంలో కప్పిన కండువా కాంగ్రెస్ పార్టీది కాదని వివరణ ఇచ్చారు. టెక్నికల్‌గా చూస్తే వారిని సదరు కారణాలతో ఈ కేసును తప్పిస్తారనే అభిప్రాయం ఉన్నది. స్పీకర్ ఏదైనా ఉల్టాఫట్టా చేస్తే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళుతామని కేటీఆర్ ప్రకటించారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కాగా ఎలాంటి సూచనలు చేశారనేది ఇప్పటి వరకు తెలియలేదు.
నేటి సభపై ఉత్కంఠ...
గతంలో బీఆర్‌ఎ్‌సలోనే ఉండి ఎన్నికల ముందు కాంగ్రె్‌సలో చేరిన గద్వాల మునిసిపాలిటీ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ తన అనుచరులు, మాజీ కౌన్సిలర్లతో పాటు బీఆర్‌ఎ్‌సలో తిరిగి చేరాలని నిర్ణయించుకున్నారు. చేరికల కోసం శనివారం నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఓ వైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పార్టీ ఫిరాయింపులపై చర్చ జరుగుతుండగా కేటీఆర్ పర్యటన ఉండటంతో ఉత్కంఠగా మారింది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే పలు సందర్భాల్లో తాను బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని చెబుతుండగా కాంగ్రెస్ నేతలు తన ఫొటోలను అనుమతి లేకుండా ఫ్లెక్సీలలో వాడుకోవడంపై కేసు కూడా నమోదు చేయించారు. ఇటీవల స్పీకర్‌కు ఇచ్చిన వివరణలో కూడా తాను బీఆర్‌ఎస్ లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంలో జడ్చర్లకు వచ్చిన కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించగా కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సలోనే ఉంటే పార్టీ ఆఫీసుకు ఎందుకు రావడంలేదని బీఆర్‌ఎస్ శాసనసభా పక్షంలో ఎందుకు కూర్చోవడం లేదని, పార్టీ కార్యక్రమాలలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరుపై కొంత పరుషంగానే మాట్లాడారు. బండ్ల పార్టీలో ఉన్నానని చెబుతున్నారుగా అన్న ప్రశ్నకు తనది ఏ పార్టీ అని చెప్పుకోలేని దురవస్థలో ఉండి ఓట్లేసిన ప్రజలను, వేయించిన కార్యకర్తలను పిచ్చోళ్లను చేస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సభ జరుగుతుండటం బీఆర్‌ఎ్‌సలోనే ఉంటే మరి ఈ సభకు బండ్ల హాజరు అవుతారా, లేక గైర్హాజరు అవుతారా అనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. సభకు హాజరైతే మిగతా శ్రేణుల స్పందన ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ కూడా తీవ్రంగా ఉన్నది.
నేడు బీఆర్‌ఎస్ బహిరంగ సభ
గద్వాల, ఆంధ్రజ్యోతి : గద్వాలలో నిర్వహించే గర్జన సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ శనివారం సాయంత్రం రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన పట్టణానికి చేరుకుంటారు. ధరూర్ మెట్టు నుంచి తేరుమైదానం సభ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లను పూర్తి చేశారు. గద్వాల మునిసిపల్ మాజీ చైర్మన్ కేశవ్ బీఆర్‌ఎ్‌సలో చే రుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఆయనతో పాటు పట్టణంలో ఆయన అనుచరవర్గం మా జీ కౌన్సిలర్లు చేరుతున్నారు. ధ రూర్, మల్దకల్ మాజీ జడ్పీటీసీ లతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు చేరనున్నారు. వారందరినీ ఇప్పటికే బీఆర్‌ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు, ఆంజనేయులు గౌడ్‌లు ఆహ్వానించారు.