Share News

కేంద్రంలోని బీజేపీ పాలకులు నోరు విప్పరా?

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:54 PM

సుప్రీం కోర్టు న్యా యమూర్తిపై జరిగిన దాడి విష యంలో కేంద్రంలోని బీజేపీ పాల కులు ఎందుకు స్పందించం లేదో దేశ ప్రజలకు సమాధానం చెప్పా లని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వెంక టేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

కేంద్రంలోని బీజేపీ పాలకులు నోరు విప్పరా?
ఉండవల్లిలో మాట్లాడుతున్న నాయకులు

- కేవీపీఎస్‌, సీఐటీయూ నాయకులు

ఉండవల్లి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : సుప్రీం కోర్టు న్యా యమూర్తిపై జరిగిన దాడి విష యంలో కేంద్రంలోని బీజేపీ పాల కులు ఎందుకు స్పందించం లేదో దేశ ప్రజలకు సమాధానం చెప్పా లని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి వెంక టేశ్వర్లు డిమాండ్‌ చేశారు. దాడిని ఖండిస్తూ శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ వి గ్రహం వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేశా రు. సనాతనవాదం పేరుతో సీజేఐపై న్యాయ వాది దాడికి పాల్పడటం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. దేశంలోని అత్యున్నత స్థాయి సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై దాడితో అంత ర్జాతీయస్థాయిలో దేశం పరువు పోయిం దన్నారు. ఇలాంటి విషయాలపై బీజేపీ ప్రభు త్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్ర మంలో నరసింహ, నాగరాజు, ఈశ్వరన్న, వెంక టస్వామి, శ్రీనివాసులు ఉన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 10:54 PM