Share News

పరిహారం అందేనా..

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:22 PM

మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

పరిహారం అందేనా..
పంటను చూపిస్తున్న రైతు నరసింహారెడ్డి (ఫైల్‌)

పంట నష్టపోయిన రైతుల ఎదురు చూపులు

మిడ్జిల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అన్నదాతలు సతమతమవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షానికి అయ్యవారిపల్లి, వెలుగొమ్ముల గ్రామాల్లోని 412 మంది రైతులకు గాను 300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా, 8 మంది రైతులకు చెందిన 8 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 8 ఎకరాల్లో మామిడితోట దెబ్బతింది. వరి సాగుకు రైతులు కూలీల కొరతతో ఎకరానికి రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. తీరా పంట చేతికందే సమయానికి వడగళ్ల వర్షం రూపంలో రైతులకు తీరని కన్నీటిని మిగిల్చింది. ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులను గుర్తించేందుకు అధికారులు గ్రామాలను సందర్శించి నివేదికలు పై అధికారులకు సమర్పించారే తప్ప తమకు ఏ మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందలేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 20 , 2025 | 11:22 PM