ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:02 PM
డిండి - నార్లాపూర్ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలని లేకుంటే ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని భూ నిర్వాసితుడు ప్రకాష్ అన్నా రు.
చారకొండ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): డిండి - నార్లాపూర్ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ఎర్రవల్లి, ఎర్రవల్లితండా గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలని లేకుంటే ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని భూ నిర్వాసితుడు ప్రకాష్ అన్నా రు. ఎర్రవల్లిలో అంబేడ్కర్ చౌస్తాలో గ్రామస్థులు, భూ నిర్వాసితులు చే పట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా భూ నిర్వాసితుడు ప్రకాష్ మాట్లాడుతూ రిజర్వాయర్ సామ ర్థ్యాన్ని తగ్గించి గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలని ఎన్నోసా ర్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుం డా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం తీసు కొచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉ పసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. భూనిర్వాసితులు పెద్దయ్యగౌడ్, సంజీవ, ప్రేమయ్య, గోపాల్, శంకర్, భాగ్యమ్మ, కేశమ్మ, అంజయ్య, రాములు, గ్రామస్థులు పాల్గొన్నారు.