మునిసిపాలిటీ రూపురేఖలు మారుస్తా : ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:28 PM
నూత నంగా ఏర్పడిన దేవరకద్ర మునిసిపాలిటీ రూ పురేఖలను ఆరు నెలల్లో మారుస్తానని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.
దేవరకద్ర, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : నూత నంగా ఏర్పడిన దేవరకద్ర మునిసిపాలిటీ రూ పురేఖలను ఆరు నెలల్లో మారుస్తానని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం మం డల కేంద్రంలోని మహబూబ్‌నగర్ - రాయ చూరు సర్వీర్ రోడ్డుకు శంకుస్థాపన చేసి, మా ట్లాడారు. పైఓవర్ బ్రిడ్జి కావడంతో అటూ ఇ టూ సర్వీస్ రోడ్డు లేక వాహనదారులు ఇబ్బం దులు పడటంతో రూ.1.10 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కథలప్ప, దేవస్థాన చైర్మన్ నరసింహరెడ్డి, మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఫారుక్‌అలీ, నాయకులు గోర్ద న్‌రెడ్డి, రాంపాండు, శ్రీను, అంజన్‌కుమార్‌రెడ్డి, రాజశేఖర్, బాలస్వామి, శ్రీను, నరసింహ తదితరులు పాల్గొన్నారు.