ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:07 PM
ప్రియుడితో కలిసి భార్య తన భర్తను చంపేసింది. ఈ సంఘటన వనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
- 72 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
- నిందితుల అరెస్టు, రిమాండ్‌కు తరలింపు
- వెల్లడించిన ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి ,నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రియుడితో కలిసి భార్య తన భర్తను చంపేసింది. ఈ సంఘటన వనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్ల డించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న కురుమూర్తి భార్య నాగమణితో కలిసి గణేష్‌నగర్ కాలనీలో నివసిస్తున్నారు. నాగమణికి కొంత కాలంగా పట్టణ సమీపంలోని మెట్టుపల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఆమె గత నెల అక్టోబర్ 25న ప్రియుడు శ్రీకాంత్ సహాయంతో భర్తకు అతిగా మద్యం తాగించింది. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న కురుమూర్తి మెడకు తాడు బిగించి చంపేశారు. అనంతరం శ్రీకాంత్‌కు సన్నిహితుడైన ఓ వ్యక్తి వద్ద కారును అద్దెకు తీసుకున్నారు. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో పడేసి తిరిగి వచ్చారు. మూడు, నాలుగు రోజుల పాటు కురుమూర్తి కనిపించకపోవడంతో అతడి సోదరి చెన్న మ్మ వదిన నాగమణిని నిలదీసింది. ఆమె పొం తనలేని సమాధానాలు ఇవ్వడంతో పట్టణ పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వన పర్తి సీఐ కృష్ణ దర్యాప్తు చేపట్టారు. నాగమణి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా, వాస్తవాలు బయటికి వ చ్చాయి. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టాగా నాగమణి తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని వెల్లడైంది. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయాధికారి ఆదేశం మేరకు రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ కృష్ణయ్య, పట్టణ ఎస్‌ఐలు హరిప్రసాద్, శశిధర్, చిన్నంబావి ఎస్‌ఐ జగన్, ఎస్పీ కార్యాలయం ఎస్‌ఐ రాము, పోలీస్ కానిస్టేబుళ్లు నవీన్ గౌడ్, అభిషేక్‌లను ఎస్పీ అభినందించి, నగదు బహుమతిని అందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉమా మహేశ్వరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.