ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం ఎందుకు?
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:42 PM
ఉపాధి హామీ పథకం పనులపై ఆడిట్ బృందం గ్రామాల్లో తనిఖీ చేసి మంగళవారం మండల పరిషత్ కా ర్యాలయంలో డీఆర్‌డీవో నర్సింగరావు ఆధ్వర్యం లో ప్రజావేదిక ఏర్పాటు చేశారు.
పంచాయతీ కార్యదర్శులపై డీఆర్‌డీవో ఆగ్రహం
మానవపాడు ప్రజావేదికలో ఆడిట్ బృందం తనిఖీలు
మానవపాడు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని 16 గ్రామాల్లో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 3.88 కోట్ల పనులు, పంచాయ తీరాజ్ శాఖ నుంచి 46.28 లక్షల పనులు జరి గాయి. ఈ పనులపై ఆడిట్ బృందం గ్రామాల్లో తనిఖీ చేసి మంగళవారం మండల పరిషత్ కా ర్యాలయంలో డీఆర్‌డీవో నర్సింగరావు ఆధ్వర్యం లో ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మంలో గ్రామాల వారీగా తనిఖీ బృందం చేసిన పనుల వివరాలు వినిపించారు. చెన్నిపాడులో బినామీ పేర్లపై హాజరువేసుకుని నిధులు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. వందరో జు పూర్తి అయిన కూలీలకు నష్టం చేస్తున్నారని వివరించారు. ఆదివారం సైతం గ్రామంలో ప నులు చేసినట్లు ఉండటాన్ని గుర్తించారు. ఏ గ్రామంలోనూ పంచాయతీ రికార్డులు సరిగాలే వని, వాటి నిర్వహణలో కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తున్నారని డీఆర్‌డీవో నర్సింగరావు మండి పడ్డారు. కొన్ని గ్రామాల్లో కార్యదర్శికి, ఫీల్డ్ అసి స్టెంట్లకు సమన్వయం లేక, పనుల పర్యవేక్షణ లో నిర్లక్ష్యం వహించారని, సంతకాలకే పరిమి తం అయ్యారని డీఆర్‌పీలు తెలిపారు. గోకుల పాడులో జరిగిన పనులపై వివరిస్తుండగా రికా ర్డులు పంచాయతీ కార్యదర్శి సుబ్రమణ్యంకు నేటికి ఇవ్వలేదన్నారు. కొన్ని గ్రామాల్లో నేటికి టార్గెట్ ప్రకారం మొక్కలు నాటలేదని, నర్సరీ ల్లోనే మొక్కలు ఉన్నాయన్నారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేదిలేని డీఆర్‌డీవో హెచ్చరించా రు. ఆయా గ్రామాల పూర్తివివరాలు బుధవా రం వెల్లడిస్తామని చెప్పారు.