అనుమతి పత్రాలులేని వాహనాలపై కొరడా
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:15 PM
జిల్లాలో అనుమతి పత్రాలు లేని వాహనాలు, ప్రయాణికులను తరలించే గూడ్స్ వాహనాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
- మూడు నెలల్లో రూ.3.95 కోట్ల జరిమానాలు
- జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు
గద్వాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అనుమతి పత్రాలు లేని వాహనాలు, ప్రయాణికులను తరలించే గూడ్స్ వాహనాలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మూడు నెలల్లో 2,313 వాహనాలపై జరిమానా విధించడం, సీజ్ చేయడం ద్వారా రూ.3.95 కోట్లు వసూలు చేసినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల బస్సులను పూర్తిగా తనిఖీలు చేసి అన్ని పత్రాలు ఉంటేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేశామని తెలిపారు. అయితే కొం దరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల న అయిజలో రెండు చోట్ల చిన్న ప్రమాదాలు జరిగాయన్నారు. త్వరలో అన్నిరకాల బస్సు డ్రై వర్లకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు వారి డ్రై వింగ్ స్కిల్స్‌ను పరిశీలిస్తామన్నారు. ప్రయివేటు గూడ్స్ వాహనదారులు అన్ని పత్రాలు కలిగి ఉండాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడ్స్ వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. పరిమితికి మిం చి సరుకులను రవాణా చేయవద్దని సూచించారు. డ్రైవర్లు మద్యంతాగి వాహనాలు నడిపితే వాహనం సీజ్ చేయడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.9.36కోట్ల టార్గెట్ విధించిందని తెలిపారు.