రుణమాఫీ ఎప్పుడు ?
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:55 PM
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేనేత రుణమాఫీ హామీ సంగతేంటి అని నేతన్నలు అంటున్నారు.
- ఏళ్లుగా ఎదురు చూస్తున్న నేతన్నలు
- డీఎల్‌సీ ఆమోదం పూర్తి, నిలిచిన ఎస్‌ఎల్‌బీసీ ఆమోదం
- ప్రకటనలకే తప్ప అమలుకాని రుణమాఫీ..
రాజోలి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేనేత రుణమాఫీ హామీ సంగతేంటి అని నేతన్నలు అంటున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసి నాలుగు నెలలు గడుస్తున్నా రుణమాఫీ మాత్రం చేయడం లేదు. దీంతో రుణమాఫీ ఎప్పుడా అన్నట్లు కార్మి కులు ఎదురుచూస్తున్నారు.
రుణమాఫీ ప్రక్రియ ఇలా..
ఉమ్మడి జిల్లాలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారు వివిధ బ్యాంకుల్లో 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందు కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 33 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశా రు. చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నిధులు విడుదల చేశారు. ఉ మ్మడి జిల్లాలోని జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌క ర్నూల్, జి ల్లాల్లో మొ త్తం 2,100 మంది నేత కార్మికులు దాదాపు రూ. 6 కోట్లు రుణాలు తీసుకు న్నట్లు అధికారులు గుర్తించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,496 మంది కార్మికులు రూ. 9,94,83,283 వ్యక్తిగత ఔట్ స్టాండింగ్ రుణాలు, 265 మంది కార్మికులు రూ. 1,81,10,500 వ్యక్తిగత క్లోజ్డ్ రుణాలు ఉన్న ట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన రుణపత్రాలను ఆయా బ్యాంకులకు అధికారులు పరిశీలించారు. ఆగస్టు 21న కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎల్‌సీ (జిల్లా లెవల్ కమిటీ) సమావేశం నిర్వ హించి ఆమోదించి ఉన్నతాధికారులకు నివే దిక పంపారు. అనంతరం ఎస్‌ఎల్‌బీసీ (స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ) సమావేశం నిర్వహించాల్సి ఉంది. అక్కడ ప్రభుత్వం వర్కింగ్ క్యాపిటల్ రుణాల ప్రధాన మొత్తా న్ని మాఫీ చేయడానికి ముందుకు వచ్చినందున, జిల్లాలోని అన్ని బ్యాంకులు చేనేత కార్మికుల రుణాల బ్రోకెన్ పీరియడ్ వడ్డీతో సహా మొత్తం వడ్డీ రూ. 68,58,334లు మాఫీ చేయాల్సి ఉంటుంది. కానీ రోజులు గడుస్తున్నాయే తప్ప రుణమాఫీ మాత్రం అవడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున త్వరగా ఎస్‌ఎల్‌సీ మీటింగ్ నిర్వహించి రుణమాఫీ చేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.