స్నానం చేసి వారమైంది?
ABN , Publish Date - Jul 24 , 2025 | 11:26 PM
నారాయణపేట జిల్లా ధన్వాడ ఆదర్శ వస తి గృహంలో నెలకొన్న సమస్యలను తీర్చాలని గురువారం విద్యార్థినులు రోడ్డెక్కారు.
- సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కిన విద్యార్థినులు
ధన్వాడ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా ధన్వాడ ఆదర్శ వస తి గృహంలో నెలకొన్న సమస్యలను తీర్చాలని గురువారం విద్యార్థినులు రోడ్డెక్కారు. వారం రోజుల నుంచి మరుగుదొడ్లు, బాత్‌రూంలు పూర్తిగా దెబ్బ తిన్నాయని, దీంతో స్నానం చేయడం లేదని తెలిపారు. అధికారులు మా గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. గంటపాటుగా రోడ్డుకు అడ్డంగా కూర్చొవడంతో వాహనలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డీఈవో గోవిందరాజులు, ఏఎంవో నర్మద, ఎంఈవో గాయత్రి, ఎస్‌ఐ రాజశేఖర్ విద్యార్థినులకు నచ్చజెప్పి, సమస్యలు పరిష్కారిస్తామన్నారు. ప్రసు ్తతం మరమ్మతు పనులు చేస్తున్నామంటూ చెప్పారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా రోడ్డుపైనే బైఠాయించారు. ఒక్క రోజు సమయం ఇస్తున్నాం.. సమస్య పరిష్కారం చూయించకపోతే మళ్లీ రోడ్డెక్కుతామంటూ వారు హెచ్చరించి రాస్తారోకో విరమించారు. ఆందోళనకు పీడీఎస్‌యూ మండల అధ్యక్షుడు మహేశ్ నాయకత్వం వహించారు.