సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - Jul 03 , 2025 | 11:19 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు.
- యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాలులో గురువారం జిల్లా యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో పాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా త్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంపై గ్రామాల్లో విస్తృ త ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణ మాఫీ, రైతు భరోసా, పేదల ఇంటికి ఉచిత కరెంటు, సన్నబియ్యం పంపిణీ తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి యువత కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, పెద్దకొత్తపల్లి మాజీ ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిదెల రాము, నాయకులు కోటయ్య, తిరుపతిగౌడ్, మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.