సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:23 PM
సంక్షేమ పథకాల ను ప్రచారం చేయాలని పార్టీ శ్రే ణులు నిరంతరం ప్రజలకు అం దుబాటులో ఉండాలని వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ కొత్తకాపు రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
పెద్దమందడి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమ పథకాల ను ప్రచారం చేయాలని పార్టీ శ్రే ణులు నిరంతరం ప్రజలకు అం దుబాటులో ఉండాలని వనపర్తి మార్కెట్ వైస్ చైర్మన్ కొత్తకాపు రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వెల్టూరులో విలేకరుల తో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం చేపడుతున్న పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతీ గ్రామంలో ప్రచారం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు రైతు భరోసా డబ్బు లు ఇచ్చిందని, దరఖాస్తుదారుల కంటే ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత కాం గ్రెస్ పార్టీదేనని అన్నారు. రామచంద్రగౌడ్, ఆర్. జగదీశ్వర్‌రెడ్డి, కొమ్ము వెంకటస్వామి, వెంకటేష్, రమేష్, రాధాకృష్ణ, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.