Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:47 PM

ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
భూత్పూర్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

కల్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ చెక్కుల పంపిణీ

భూత్పూర్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ హాజరై లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి మండలంలోని తాటికొండ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, మండల అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ యువజన అధ్యక్షుడు భూపతిరెడ్డి, మాజీ సర్పంచులు హర్యానాయక్‌, తిరుపతయ్య, కొండన్న, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పుల్లప్ప, సాయిలు, పద్మ, నాయకులు బాలవర్ధన్‌రెడ్డి, ఎర్రవాపు నర్సింహులు, వడ్డె శ్రీను, తహసీల్దార్‌ కిషన్‌, ఎంపీడీవో ఉమాదేవి పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసే చేరికలు

చిన్నచింతకుంట, : దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జీఎంఆర్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని దమగ్నాపూర్‌లో మధనాపూర్‌ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కాంగ్రెస్‌ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పారిశ్రామికంగా వెనుకబడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు బ్రహ్మోస్‌ మిస్సైల్‌ తయారీ యూనిట్‌తో పాటు అడ్డాకులకు డ్రై పోర్టు రాబోతుందన్నారు. దీంతో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దుప్పల్లి గ్రామానికి ఒక్క డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:47 PM