Share News

పేదలందరికీ సంక్షేమం

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:32 PM

ప్రజా పాలనలో రాష్ట్రం లోని పేదలకు సంక్షేమ పథకాలు అందే లా ప్రభుత్వం పని చేస్తోందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మ హేందర్‌రెడ్డి అన్నారు.

పేదలందరికీ సంక్షేమం
వేదికపై తెలంగాణ గీతాన్ని ఆలపిస్తున్న తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌

- రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యం

- అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పని చేయాలి

- శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

- అట్టహాసంగా ప్రజా పాలన దినోత్సవం

వనపర్తి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలనలో రాష్ట్రం లోని పేదలకు సంక్షేమ పథకాలు అందే లా ప్రభుత్వం పని చేస్తోందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మ హేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలం గాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్క రించుకుని కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పా టు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎ మ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి ఆవిష్క రించారు. మొదట పోలీస్‌శాఖ ద్వారా గౌ రవ వందనాన్ని స్వీకరించారు. అనంత రం వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమ లవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లు, సాధించిన లక్ష్యాలపై ప్రగతి నివేది కను చదివి వినిపించారు. 78ఏళ్ల క్రితం ఇదే రోజున మన తెలంగాణ ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమైందన్నారు. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని, అందుకే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్ర భుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ప్రజలకు ఇచ్చిన ఆరు హా మీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుం దన్నారు. మొదట మహాలక్ష్మి పథకం మ హిళలకు వరంగా మారిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రతీ మహిళను మహాలక్ష్మిగా చేయాలనే సంకల్పంతో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిం దని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,38,68,000 మంది మహిళలు ఉచితం గా ప్రయాణించారని తెలిపారు. ఇందుకు గాను రూ.97.54 కోట్లను ప్రభుత్వం భ రించిందన్నారు. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం రూ. 500కే వంట గ్యాస్‌ సరఫరా చేసే కార్య క్రమాన్ని కూడా ప్రభుత్వం అమలు చే స్తోందన్నారు. జిల్లాలో 85వేల మందికి 2,34,879 గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చే యడం జరిగిందని, దీనికి గాను ప్రభు త్వం రూ.6.56 కోట్ల సబ్సిడీ అందిం చిందన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములైన ప్రజలకు, అధికారులు, ప్ర జాప్రతినిధులకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ కిమ్యా నాయక్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాద య్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, ప్రజాప్రతి నిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 11:32 PM