రాజీవ్ సద్భావన యాత్రకు స్వాగతం
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:06 PM
రాజీవ్‌గాంధీ సద్భావన జ్యోతి యాత్రకు మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం ఘన స్వాగతం పలికారు. కృష్ణ బ్రిడ్జి నుంచి బిలాల్‌పూర్ వరకు యాత్ర సాగింది. ఈ సందర్భంగా మంత్రి యాత్ర కాగడను అందుకొని, మాట్లాడారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన నేత రాజీవ్ గాంధీ: మంత్రి
మక్తల్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ సద్భావన జ్యోతి యాత్రకు మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం ఘన స్వాగతం పలికారు. కృష్ణ బ్రిడ్జి నుంచి బిలాల్‌పూర్ వరకు యాత్ర సాగింది. ఈ సందర్భంగా మంత్రి యాత్ర కాగడను అందుకొని, మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని అన్నారు. రాజీవ్ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దేశం సంఘటితం కోసం కృషి చేశారని కొనియాడారు. యాత్ర కృష్ణ మండలం టైరోడ్ నుంచి మక్తల్ మీదుగా నారాయణపేటలోకి ప్రవేశించింది. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రాజీవ్‌గాంధీ జ్యోతియాత్ర జాతీయ అధ్యక్షుడు దొరై, సుజేంద్రశెట్టి తదితరులు పాల్గొన్నారు.