స్కిల్ డెవలప్‌మెంట్ హబ్‌గా మారుస్తాం
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:12 PM
నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు స్కిల్‌డెవల్‌పమెంట్ సెంటర్ల ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో మహబూబ్‌నగర్‌ను స్కిల్‌డెవల్‌పమెంట్ హబ్‌గా మారుస్తామని అన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
తెలంగాణ అకాడమీ ఫర్ నాలెడ్జ్ శిక్షణా కేంద్రం ప్రారంభం
మహబూబ్‌నగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు స్కిల్‌డెవల్‌పమెంట్ సెంటర్ల ద్వారా వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో మహబూబ్‌నగర్‌ను స్కిల్‌డెవల్‌పమెంట్ హబ్‌గా మారుస్తామని అన్నారు. శుక్రవారం నగరంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో గల మునిసిపల్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ నా లెడ్జ్ శిక్షణా కేంద్రాన్ని(టాస్క్) ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్‌నగర్ టాస్క్ సెంటర్‌ను హైదరాబాద్‌లోని స్కిల్ విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దపల్లి తరువాత మహబూబ్‌నగర్‌లో రెండో టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. టాస్క్ సెంటర్‌లో అన్ని రకాల కోర్సులకు అడ్వాన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చే సిన విద్యార్థులు ఎవరైనా శిక్షణ పొందొచ్చన్నారు. మొదటి బ్యాచ్‌లో 50 మందికి శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. మెట్టుగడ్డలోని నాన్‌వెజ్, వెజ్ మార్కెట్ కోసం ఏర్పాటు చేసిన భవనాన్ని టాస్క్ సెంటర్‌గా మారుస్తామన్నారు. పీయూ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాపరంగా ఎమ్మెల్యే తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. పీయూకు లా, ఇంజనీరింగ్ కళాశాలలను తెచ్చారని, ట్రిపుల్ ఐటీని సాధించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్మన్ బెక్కరి అనిత, కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నాయకులు సీజే బెనహర్ పాల్గొన్నారు.