జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:02 PM
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కాంగ్రెస్ నాయకుడు సురేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధనకోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో 17రోజులనుంచి దీక్షలు చేస్తు న్నారు.
- ఎమ్మెల్యే హామీతో దీక్ష విరమణ
పాలమూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కాంగ్రెస్ నాయకుడు సురేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధనకోసం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో 17రోజులనుంచి దీక్షలు చేస్తు న్నారు. 15రోజుల్లో సమస్యలు పరిష్కరి స్తామని బుధవారం హామీ ఇవ్వటంతో దీక్షలు విరమించారు. ఎమ్మెల్యే హామీతో దీక్షలు విరమిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజ యకుమార్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాకిటి అశోక్‌కుమార్, గోపాల్ ప్రకటించారు. మౌలాలి గుట్టవద్ద పట్టాలు పొందిన జర్నలిస్టుల ఇళ్ల తాళాలు ఇస్తామని, కోర్టు కేసులో ఉన్న ఇరు వర్గాలను కూర్చోబెట్టి పరిష్కరిస్తామని, ఎస్‌వీ ఎస్ దగ్గర డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పట్టా ఉంటే నిర్మాణం చేయని వారికి ఎన్‌వోసీ ఇస్తామని హామీ ఇచ్చారు. దీక్షలను విరమింప చేసిన వారిలో మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనం ద్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, మైత్రి యాదయ్య తదితరులు ఉన్నారు.