వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:36 PM
జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ శ్రీని వాస్‌రెడ్డి తెలిపారు.
ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి
గద్వాల అర్బన్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈ శ్రీని వాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ జిల్లా నుంచి ఏడు వినతులు అందాయన్నారు. రైతులు కొ త్తగా ఏజీఎల్ ట్రాన్స్‌ఫార్మర్లు కావాలని కోరార ని, అలాగే లైన్ షిఫ్టింగ్, బిల్లింగ్ రిలేటెడ్ తది తర వాటికి సంబంధించి వినతులు అందాయ న్నారు. జిల్లాలోని సంబంధిత అధికారులకు విద్యుత్ సమస్యలపై పరిష్కారం దిశగా చర్య లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి రావు, ఏవో శ్రీనివాస్, ఏడీఈ రమేశ్‌బాబు, ధరూర్ ఏఈ అనీల్‌కుమార్, పట్టణ ఏఈ శివకుమార్, రూరల్ ఏఈ శ్రీనివాస్, కేటిదొడ్డి ఏఈ అనీల్ కుమార్ ఉన్నారు.