డీసీసీ అధ్యక్షులుగా సమర్థులనే ఎంపిక చేస్తాం
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:33 PM
సమర్థులనే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం శనివారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ చేశారు. డీసీసీ కార్యాలయంలో
ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి
మహబూబ్‌నగర్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): సమర్థులనే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామి అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం శనివారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ చేశారు. డీసీసీ కార్యాలయంలో మహబూబ్‌నగర్ అర్బన్‌కు సంబంధించి అభిప్రాయాలు తీసుకోగా, అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల నాయకుల అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ ప్రతీ జిల్లా నుంచి ఆరుగురి పేర్లు ఫైనల్ చేసి ఈనెల 21న ఏఐసీసీకి నివేదిక ఇవ్వడం జరుగుతుందని, ఏఐసీసీ అధ్యక్షులను ఎంపిక చేస్తుందన్నారు. నారాయణపేట జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం కూడా ఫోన్‌లో తీసుకున్నామని, మంత్రి శ్రీహరి అభిప్రా యం చెప్పారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, పీసీసీ అబ్జర్వర్ ఉజ్మషాకీర్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, నాయకులు సంజీవ్ ముదిరాజ్, మన్నె జీవన్‌రెడ్డి, మల్లు నర్సింహారెడ్డి, లక్ష్మణ్‌యాదవ్, ఆనంద్‌కుమార్‌గౌడ్ హర్షవర్ధన్‌రెడ్డి, మారెపల్లి సురేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ఎన్‌పి వెంకటేశ్, జహీర్‌అక్తర్, చంద్రకుమార్‌గౌడ్, వసంత, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వండి
మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ఏఐసీసీ పరిశీలకుడు నారాయణస్వామిని కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నారు.