Share News

ప్రతీ విద్యార్థికి పోషకాహారం అందిస్తాం

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:13 PM

జిల్లాకేంద్రంలోని ఐడీవోసీలోని తన చాంబర్‌లో గురువారం ఎస్‌.సి, ఎస్టీ, బీసీ, ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో 2025-26కు సంబంధించిన మెనూ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ సంతోష్‌ విడుదల చేశారు.

ప్రతీ విద్యార్థికి పోషకాహారం అందిస్తాం
కొత్త మెనూ పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

  • హాస్టళ్లకు సంబంధించిన కొత్త మెనూ పోస్టర్‌ను విడుదల చేసిన కలెక్టర్‌

గద్వాలన్యూటౌన్‌, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని ఐడీవోసీలోని తన చాంబర్‌లో గురువారం ఎస్‌.సి, ఎస్టీ, బీసీ, ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలో 2025-26కు సంబంధించిన మెనూ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ సంతోష్‌ విడుదల చేశారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లతో 2025-26 విద్యాసంవత్సరానికి కొత్త పోషకాహార మెనూ అమలులోకి వచ్చిందన్నారు. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి విద్య ఈ మూడు ఒకదానికొకటి విడదీయరాని అంశాలు అని విద్యార్ధులు సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ అత్యంత ప్రధా న లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడేవిధంగా నిత్య ఆహారంలో పోషక పదార్థాలు ఉండేలా కొత్త మెనూ రూపొందించామన్నారు. పిల్లల శ్రేయస్సు దృష్ట్యా ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, వంటశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. హాస్టళ్లలో వండే భోజనం తాజా ఆహార పదార్థాలతో సిద్ధం చేయాలని, విద్యార్థులకు సమయానికి భోజనం అందించా లన్నారు. హాస్టళ్లలో వంటగదులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ జరుగాలని, నీటి వనరులు, నిల్వ ప్రదేశాలు శుభ్రంగా ఉం చాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఆహారంలో ఎటువంటి నిర్లక్ష్యం చేసుకోకూడదన్నారు. కార్య క్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్‌పాష, ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ నుషిత, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:13 PM