Share News

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:37 PM

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

చివరి ఆయకట్టు వరకు  సాగునీరు అందిస్తాం
ర్యాలంపాడు రిజర్వాయర్‌ వద్ద మోటార్‌ను ఆన్‌ చేసి నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ర్యాలంపాడు కుడి కాలువకు నీటి విడుదల

ధరూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా, ధరూరు మండల పరిధిలోని ర్యాలంపాడు రిజర్వా యర్‌ కుడి కాలువకు సోమవారం ఆయన పూజలు చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ర్యాలంపాడు రిజర్వాయర్‌ నుంచి ఆయకట్టుకు సకాలంలో సాగు నీటిని అందిస్తున్నామన్నారు. రైతులు సమన్వయంతో వ్యవహరిస్తూ సాగు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి అన్ని విధాలుగా అండ గా ఉంటోందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కురువ హనుమంతు, జడ్పీ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, జిల్లా సీనియర్‌ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ బోయ వెంకటరాములు, మాజీ ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజశేఖర్‌, మాజీ వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌ రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌ విజయ్‌, డీవై రామన్న, శ్రీరాములు, రాముడు, విజయ్‌ రెడ్డి, నర్సింహులు, తిమ్మప్ప, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:37 PM