రైతులకు నష్ట పరిహారం ఇప్పిస్తాం
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:15 PM
మక్తల్- నారాయణపేట-కొడం గల్ ఎత్తిపోతల పథకం భూసర్వేలో భాగం గా మక్తల్ నియోజక వర్గం కాట్రేవ్‌పల్లి గ్రా మంలో భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్ట పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు.

- మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్ రూరల్/ ఊట్కూర్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మక్తల్- నారాయణపేట-కొడం గల్ ఎత్తిపోతల పథకం భూసర్వేలో భాగం గా మక్తల్ నియోజక వర్గం కాట్రేవ్‌పల్లి గ్రా మంలో భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్ట పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి వద్ద రైతులను క లుసుకొని వారి అనుమానాలను నివృత్తి చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తానని, సర్వేకు సహకరించాలని కోరారు. తహసీల్దార్ సతీష్, ఇరిగేషన్ ఏఈ నాగశివ, చంద్రకాంత్‌గౌడ్ తదితరులున్నారు.
అదేవిధంగా, ఊట్కూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం రాత్రి ఆయన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్ గ్రామాల రైతులతో ఆయన సమావేశ మయ్యారు. సమావేశంలో రైతుల అభ్యంతరాలు, డిమాండ్‌లను విన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులందరికి న్యాయమైన నష్టపరిహారం ఇప్పించడంతో పాటు, వారికి అండగా నిలబడుతామని అన్నారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమావేశంలో విండో అధ్యక్షుడు ఎం. బాల్‌రెడ్డి, తహసీల్దార్ చింత రవి, ఊట్కూర్ మాజీ సర్పంచ్ సూర్యప్రకాష్‌రెడ్డి, కాంగ్రెస్ నా యకులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.