అన్ని వసతులు కల్పిస్తాం
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:06 PM
పాఠశాలకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాల్‌పేట, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో బుద్దారం సమీపంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ఎలుకలు కరిచిన విషయంపై విద్యార్థులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎలుకలను చూశాం.. కానీ అవి కరిచాయనే విషయం తెలియదన్నారు. ముందు జాగ్రత్తగా గోపాల్‌పేటలోని పీహెచ్‌సీలో వైద్యం చేయించుకున్నామని కలెక్టర్‌కు తెలిపారు. మా పాఠశాలకు ప్రహరీ, సెప్టిక్‌ట్యాంక్ నిర్మిస్తే బాగుటుందని విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ మీకు కావలసిన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని, మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనం తరం విద్యార్థులకు పశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.