Share News

రైతులకు సరిపడా యూరియా అందిస్తాం

ABN , Publish Date - Jul 24 , 2025 | 11:28 PM

రైతులకు సరిపడా యూరియాను అందజేస్తామని స్టేట్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పద్మహర్ష తెలిపారు.

రైతులకు సరిపడా యూరియా అందిస్తాం
నాగర్‌కర్నూల్‌ పీఏసీఎస్‌లో ఎరువులను తనిఖీ చేసి రైతులతో మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పద్మహర్ష

- ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పద్మహర్ష

కందనూలు/ బిజినేపల్లి / జడ్చర్ల/ భూ త్పూర్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : రైతులకు సరిపడా యూరియాను అందజేస్తామని స్టేట్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి పద్మహర్ష తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్‌ ఎరువుల నిల్వల ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల కోసం వచ్చిన రైతు లతో మాట్లాడారు. మోతాదుకు మించి యూ రియాను వాడొద్దని సూచించారు. ఎవరైనా యూరియాతో పాటు ఎరువులను అక్రమంగా నిల్వ చేసి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉం టాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు, డివిజన్‌ అధికారి పూర్ణ చంద్రారెడ్డి, ఏవో రాజు, పీఏసీ ఎస్‌ అఽధికారి శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.

అదేవిధంగా బిజినేపల్లి మండల కేంద్రంలో ని పీఏసీఎస్‌ గోదాంలోని ఎరువుల నిల్వలను, పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. భూసా ర పరీక్షలు చేయించి లోపించిన ఎరువులను మాత్రమే పంటకు అందించాలని సూచించా రు. రైతులకు అవసరమైన ఎరువులు నిల్వలు సంమృ ద్ధిగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవ సరం లేదన్నారు.

ఫ జడ్చర్లలోని హకా ఫా ర్మర్‌ సర్వీస్‌ సెంటర్‌లతో పా టు పలు ఫర్టిలైజర్స్‌ దుకా ణాలలో ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎరువుల పంపిణీ పీవోఎస్‌ మిషన్ల ద్వారా జరుగుతుం దా, లేదా అని రైతులను అ డిగి తెలుసుకున్నారు.

భూత్పూర్‌ మండల కేంద్రంలో ఉన్న అ న్నదాన, సహకార ఫార్మా సర్వీస్‌ స్టేషన్‌, ఆగ్రో రైతు సేవా కేంద్రం, స్థానిక సహకార సంఘం ఎరువుల దుకాణాలను స్టాక్‌ వివరాలను పరి శీలించారు

Updated Date - Jul 24 , 2025 | 11:28 PM