Share News

రైతులకు యూరియా కొరత రానివ్వం

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:41 PM

యూరియా కొరత ఉండదు రైతులు అపోహకు గురికాకండని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయాధికారి సక్రియనాయక్‌ రైతులకు సూచించారు.

రైతులకు యూరియా కొరత రానివ్వం

అయిజ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరత ఉండదు రైతులు అపోహకు గురికాకండని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయాధికారి సక్రియనాయక్‌ రైతులకు సూచించారు. మంగళవారం అయిజ సింగిల్‌ విండో కార్యాలయంలోని ఎరు వుల నిల్వ గోదాములను పరిశీలించారు. నిల్వ రికార్డులను తనిఖీ చేశారు. ఈసందర్బంగా సూ చనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. ఈ సం దర్బంగా మాట్లాడారు. అయిజలో ఆర్డీఎస్‌తో పాటు బోర్లు, బావుల కింద వరిసాగు అధికం గా చేశారని ఆ ఉద్దేశ్యంతో రైతులు అధికంగా యూరియా వాడుతున్నారని అన్నారు. మరి కొంతమంది రైతులు రభీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో మరి యూరియా కొరత ఏర్పడుతుందనే అపోహతో ఇపుడే యూరియా కొనుగో లు చేసి నిల్వ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కావాల్సినంత యూరియా సరఫరా జరుగుతోందని తెలిపారు. యూరియా నిల్వలు వచ్చిన ప్రతీసారి పోలీసులు, వ్యవసాయాధికారుల సహకారంతో టోకన్‌లు జారీ చేసి రైతుల కు యూరియా అందిస్తున్నట్లు అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్‌ కింద వరికి వేసే మూడవ కోట సైతం పూర్తవుతుందని, రైతులకు ఇక యూరియా కోసం ఇబ్బందులు ఎదు ర్కోవలసిన అవసరంలేదని మండల వ్యవసాయాధికారి జనార్దన్‌ తెలిపారు.

Updated Date - Sep 16 , 2025 | 11:41 PM