మహిళలను మహారాణులను చేస్తాం
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:39 PM
రాష్ట్రంలో ఉన్న మహిళలను మహారాణులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.
- త్వరలోనే సోలార్ సెట్లు, పెట్రోల్ బంక్‌లు
- చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి
గోపాల్‌పేట, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న మహిళలను మహారాణులను చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఉమ్మడి గోపాల్‌పేట, ఏదుల, రేవల్లి మండలాల మహిళ లకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల కు పెద్ద పీట వేశామని, కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. బస్సులకు మహిళలను యజమానులను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ప్రతీ మండల కేంద్రంలో మహిళ లకు పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ తో కలిసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అక్కడికి వచ్చిన మహిళ లకు ఎమ్మెల్యే భోజనం వడ్డించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉమ్మడి మండల నాయకులను తదితరులు పాల్గొన్నారు.