ప్రతీ వసతి గృహాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:15 PM
ప్రతీ వసతి గృహాన్ని ఆదర్శంగా తీర్చిద్దుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ వసతి గృహాన్ని ఆదర్శంగా తీర్చిద్దుతానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో గల ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడారు. వసతి, భోజనం, విద్యా సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహా ప్రాంగణంలో పార్కు, చిల్డ్రన్స్ ప్లేయింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని, బీసీ వసతి గృహం పై అంతస్తులో కొత్త హాల్ నిర్మాణానికి అంచనా సిద్ధం చేయాలని ముడా ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. ఎస్సీ వసతి గృహ ప్రాంగణంలో సీసీ బెడ్ వేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ లైన్ పాఠశాలను సందర్శించి, అక్కడ పది విద్యార్థులకు నిర్వహిస్తున్న శతశాతం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడి వందశాతం ఫలితాలు నమోదు చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ పాల్గొన్నారు.