బీజేపీ పథకాలు ప్రజలకు తెలియజేస్తాం
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:38 PM
నియోజకవర్గంలో ‘గావ్ చలో.. బస్తి చలో’ కార్యక్ర మం ద్వారా ప్రతీ ఇంటికి బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకా ల గురించి ప్రజలకు చేరవేయాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ అన్నారు.

శ్రీరంగాపూర్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో ‘గావ్ చలో.. బస్తి చలో’ కార్యక్ర మం ద్వారా ప్రతీ ఇంటికి బీజేపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకా ల గురించి ప్రజలకు చేరవేయాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ అన్నారు. శనివారం శ్రీ రంగాపురం మండలం తాటిపాము లలో మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆధ్వర్యం లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్ హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గ్రా మ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీర సముద్రం చెరువు కట్టకు గండి పడి నిల్వ నీరు లీకేజీ రూపంలో వృథా అవుతుందని గ్రా మస్థుల ద్వారా తెలుసుకున్నారు. కంబాలపురం, తాటిపాముల గ్రామ రైతులకు దాదాపు 800 నుంచి 1000 ఎకరాలకు పంట చేసుకోవడానికి వచ్చే నీరు అంతా లీకేజీ అవుతుందని రైతులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నా రాయణ, మాజీ జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి, రా ష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వేమారెడ్డి, జిల్లా ప్రధాన కార్య దర్శి రామన్ గౌడ్, మండల అధ్యక్షుడు విష్ణువ ర్ధన్, పట్టణ అధ్యక్షుడు క్రాంతి నాయుడు, శ్రీరం గాపురం మండల, వనపర్తి మునిసిపాలిటీ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.