జీతాలు చెల్లించకపోతే సమ్మె నోటీసు ఇస్తాం
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:40 PM
జీతాలు చెల్లించకపోతే సమ్మె నోటీసు ఇవ్వడానికి వెనకాడబోమని హెచ్చరిస్తూ జేఏసీ పిలుపు మేరకు మంగళవా రం ఉపాధి ఉద్యోగులు అదనపు కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందించారు.
- అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన జేఏసీ నాయకులు
గద్వాల, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. పిల్లల స్కూల్ ఫీజులు, ఇం టి అద్దెలు, పాలబిల్లులు కూడా చెల్లించలేదు. ఇలానే కొనసాగితే సమ్మె నోటీసు ఇస్తామని హెచ్చరిస్తూ జేఏసీ పిలుపు మేరకు మంగళవా రం ఉపాధి ఉద్యోగులు అదనపు కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందించారు. ఉపాధి హా మీలో అధికారులు ఇచ్చిన టార్గెట్ మేరకు సెలు వు రోజుల్లో కూడా పనిచేస్తున్నామని పేర్కొన్నా రు. అయిన తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఇంట్లో కిరాణం సామాన్లు కొ నడానికి అప్పులు చేస్తున్నాం. గ్రామాలకు వెళ్లడానికి ఆటో, పెట్రోల్ ఖర్చులకు కూడా డబ్బు లు లేవని వాపోయారు. మూడు నాలుగు నెల ల వేతనాలు పెండింగ్‌తోనే చెల్లిస్తున్నారని ఇలాఉంటే తాము ఎలా పనిచేయాలని వాపోయారు. జీతాలు చెల్లించకపోతే సమ్మె నోటీసు ఇవ్వడానికి వెనకాడబోమని, తమ పరిస్థితిని అ ర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తమ న్యాయమైన కోరికలు తీర్చకపోతే నిరసన కార్యక్రమా లు చేపడుతామని హెచ్చరించారు. మంగళవా రం కలెక్టర్, డీఆర్‌డీవోలకు వినతిపత్రాలు ఇవ్వ డం, బుధవారం పెన్‌డౌన్, షట్‌డౌన్ కార్యక్రమా లు, గురువారం సహాయ నిరాకరణ, శుక్రవారం సీఆర్‌డీలో శాంతియుత నిరసనలు, శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వ నున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.