పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:26 PM
పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
మిడ్జిల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దోనూర్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేయ డంతో పాటు మున్న నూరులో నిర్మిస్తున్న సీ సీరోడ్డు నిర్మాణ పనుల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజ కవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చే సేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అం తకుముందు హైదరా బాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయానికి ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మార్చేందుకు అసెంబ్లీలో తీర్మాణం చేసి, సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును పెట్టేందుకు ప్రయత్నించడం సరికాదని, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఎన్నం సత్యనారాయణ గుప్తా, ప్రధాన కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి యాదయ్యగుప్తా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మా ర్కెట్ చైర్మన్ అల్వాల్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రబ్బాని, మార్కెట్ డైరెక్టర్లు సత్యంగౌడ్, బంగారు, నాయకులు సాయులు, శారద వెంక టయ్య, గౌస్, మల్లికార్జున్‌రెడ్డి, నర్సిములు, వెంక టేష్‌గౌడ్, రాజారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.