డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:03 AM
డబుల్ బెడ్రూం ఇళ్లునిర్మించిన ప్రాంతాన్ని అన్నివిధాలు గా అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
గృహ ప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్రూం ఇళ్లునిర్మించిన ప్రాంతాన్ని అన్నివిధాలు గా అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఓ లబ్ధిదారుడు ఆదివారం నిర్వహించిన గృహప్రవేశానికి వెళ్లిన ఆయన అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను పొం దిన ప్రతీ లబ్ధిదారులు ఇక్కడ నివాసం ఉండేవి ధంగా కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 80శాతం మౌలిక వసతుల కల్పన జరిగిందని మిగిలిన 20శాతం పనులను త్వరగా పూర్తయ్యే విధంగా అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ సందర్బం గా గృహప్రవేశం చేసిన లబ్ధిదారుడు ఎమ్మె ల్యేను సత్కరించి స్వీట్లు తినిపించారు. కాగా చాలామంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరికొన్ని సౌకర్యాలను స్వతహాగా ఏర్పాటు చేసుకోవడంతో ఇళ్లకు అందం వచ్చిచేరింది. స్థోమత కలిగిన లబ్ధిదారులు ఏర్పాట్లు చేసుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ కౌన్సిలర్ మురళీ, నాయకుడు అజయ్, షుకూర్, చంద్రశేఖర్, ధర్మనాయుడు, మధు, బాలాజీ, మొయినుద్దీన్, పరశురాముడు, షాషా, రాజు తదితరులు ఉన్నారు.