Share News

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:18 PM

రైతులు పండిం చిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నారాయ ణపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి అన్నారు.

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి

దామరగిద్ద, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతులు పండిం చిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నారాయ ణపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని పీడెం పల్లి, కానుకుర్తి, మల్‌రెడ్డిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. విండో చైర్మన్‌ పుట్టి ఈదప్ప, ఖాజా మియ్యా, జీకే వెంకటప్ప, బర్ల ఆనంద్‌, కె.వెంకట్‌రాంరెడ్డి, తమ్మలి రఘు, రఘు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:18 PM